BREAKING
పెదపులివర్రు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం.. నూతన పెన్ష పత్రాలుపంపిణీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా ఆటల పోటీలు ధర్నాల పేరుతో టిడిపి నేతలు డ్రామాలు చేస్తున్నారు... ఎన్నికల్లో జరిగిన అరాచకాలను పక్కదారి పట్టించేందుకు నిరసనలు.. బీటెక్ రవి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు చింతర్లపల్లి ఎంపీటీసీ గా ప్రమాణస్వీకారం చేసిన చెన్నకేశవులు దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ధాన్యం అమ్ము కొండి ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు

ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు

Select Suryaa Now
ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారిని ఎంపిటిసి సభ్యులుగా ఎన్నికైన వారిని గురువారం పలువురు తెలుగుదేశం నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అనంతరం మండలాధ్యక్షురాలుగా ఎన్నికైన దావా సుమన్యును, మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నరసయ్య నాయుడును ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన బొమ్మతోటి ఇందిరమ్మ,వీరదిమ్మే గీతమ్మ, కేతా వేణుగోపాల్ రెడ్డి,  షేక్ ఖాజావలి, మామిడి చందన,పువ్వాడ వెంకటేశ్వర్లు లను నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.మండల టిడిపి అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, మాజీ మండల అధ్యక్షుడు కేత వేణుగోపాల్ రెడ్డి, కరటంపాడు వేమన సంస్థాన వారసుడు వేమన రామచంద్ర నాయుడు, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు దావా పెంచల్రావు, తెలుగుదేశం నాయకులు కొర్రపాటి జనార్ధన్ నాయుడు,చల్లా రవికుమార్ రెడ్డి, పూనుగుంట ధనుంజయ, కిలారి సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు ప్రాదేశిక ప్రజా ప్రతినిధులను ఘనంగా శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.