BREAKING
సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా ముగిసిన ఆర్డీటీ బాలల హక్కుల వారోత్సవాలు.. శ్రీవారి ఆలయంలో నేడు కైశికద్వాదశి ఆస్థానం..మాడవీధుల్లో ఊరేగనున్న ఉగ్రశ్రీనివాసమూర్తి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం సంచాలకుడిగా ప్రొఫెసర్ జి. వెంకట రమణ నియామకం యూజిసి నిబంధన మేరకే పి హెచ్డీ ప్రవేశాలు జనహిత సంఘం ఆవిర్భావం.. సమాజ శ్రేయస్సే లక్ష్యం.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవకు కృషి చేస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్థుల ఎంపిక.. ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్!

ధర్నాల పేరుతో టిడిపి నేతలు డ్రామాలు చేస్తున్నారు... ఎన్నికల్లో జరిగిన అరాచకాలను పక్కదారి పట్టించేందుకు నిరసనలు.. బీటెక్ రవి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు

Select Suryaa Now
ధర్నాల పేరుతో టిడిపి నేతలు డ్రామాలు చేస్తున్నారు... ఎన్నికల్లో జరిగిన అరాచకాలను పక్కదారి పట్టించేందుకు నిరసనలు.. బీటెక్ రవి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు

పులివెందుల, మేజర్ న్యూస్ :

ఎన్నికల్లో జరిగిన అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని పక్కదారి పట్టించేందుకే టీడీపీ నాయకులు ధర్నాల పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం పులివెందుల పట్టణంలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేయడం చూస్తుంటే నవ్వాలో, అసహ్యించు కోవాలో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల్లో జరిగిన ఘటనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి నిరసనలు చేపడుతు న్నారని ఆరోపించారు. కొట్టేది వాళ్లే.. తప్పుడు కేసులు పెట్టేది వాళ్లే.. తిరిగి ఏడ్చేది, నిరసనలు చేసేది కూడా వాళ్లేనంటూ విమర్శించారు. బయట ప్రాంతాల నుంచి వ్యక్తులను పిలిపించి సామాన్య ప్రజలను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం, పోలింగ్ బూత్‌ల వద్ద ఏజెంట్లు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లు టీడీపీ తోరణాలు తొలగించారనే కారణంతో వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారని తెలిపారు. వేల్పుల రాము, సైదాపురం సురేష్‌రెడ్డిపై దాడి జరిగినప్పుడు తాము ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తమపై దాడులు జరిగినప్పటికీ తిరిగి తమపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.చక్రాయపేటలో వైసీపీ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేసినందుకు వారిపై బెయిల్‌ లభించని కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆగడూరు క్లస్టర్‌లో మొదట పెట్రోల్ బాంబులు వేసింది ఎవరు? రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.తమ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, ఎక్కడైనా నామినేషన్ పత్రాలు చించారా, అభ్యర్థులపై దాడులు చేశారా అనే విషయాలను ఆధారాలతో చూపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రాణాలను పణంగా పెట్టి అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడటానికి కూటమి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకే వేంపల్లి, గిడ్డంగివారిపల్లెలో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని పేర్కొన్నారు.డీఐజీ కోయ ప్రవీణ్ ఒక ప్రాంతానికి బాధ్యత వహించే అధికారి అయినప్పటికీ, పులివెందులకే ప్రత్యేకంగా పరిమితమైన అధికారిలా వ్యవహరిస్తున్నారని అవినాష్‌రెడ్డి విమర్శించారు. డీఐజీ, కలెక్టర్, పోలీసు యంత్రాంగం కూటమి నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు బయట ఉంటే తట్టుకోలేక వారిని అరెస్టు చేయాలని కోరుతున్నారని అన్నారు.ఈ ప్రాంతంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నది ఎవరు? దాడులకు పాల్పడుతున్నది ఎవరు? అనే విషయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దౌర్జన్యాలను కప్పిపుచ్చుకునేందుకే ధర్నాలు నిర్వహించడం, వాటిని డీఐజీ విరమింపజేయడం కూడా ఒక రాజకీయ డ్రామాలో భాగమని విమర్శించారు. ప్రజల ఆగ్రహానికి కూటమి నాయకులు గురవుతున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు.

పి. కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా