BREAKING
పెదపులివర్రు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం.. నూతన పెన్ష పత్రాలుపంపిణీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా ఆటల పోటీలు ధర్నాల పేరుతో టిడిపి నేతలు డ్రామాలు చేస్తున్నారు... ఎన్నికల్లో జరిగిన అరాచకాలను పక్కదారి పట్టించేందుకు నిరసనలు.. బీటెక్ రవి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు చింతర్లపల్లి ఎంపీటీసీ గా ప్రమాణస్వీకారం చేసిన చెన్నకేశవులు దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ధాన్యం అమ్ము కొండి ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు

పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి

Select Suryaa Now
పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి

పులివెందుల, మేజర్ న్యూస్ :

పులివెందులలో ఏదో జరిగిపోతోందంటూ సాక్షి ఛానల్‌తో పాటు వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లిందని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.గురువారం స్థానిక టీడీపీ కార్యాలయం నందు నియోజక వర్గ ఇన్చార్జి బీటెక్ రవి మాట్లాడుతూ 
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 21 మంది అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని, నామినేషన్ కేంద్రాలను కడపకు మార్చాలని వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే నామినేషన్ కేంద్రాలను మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసిన న్యాయస్థానం, అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులు మాత్రమే వెళ్లేలా (1+2) పోలీసు ఎస్కార్ట్ కల్పించాలని ఆదేశించిందన్నారు. కోర్టు ఉత్తర్వులు రాత్రి 8 గంటలకు వెలువడగా, అంతకుముందే సాయంత్రం 5 గంటలకే 21 మందిలో 13 మంది ఎలాంటి పోలీసు రక్షణ లేకుండానే ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ పరిణామాలను బట్టి వైసీపీ నేతలు కోర్టును, ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.పోలీసులు తమకు అడ్డుపడుతున్నా రంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 307 కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మద్ది నరసింహారెడ్డిని వెంటబెట్టుకుని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారని, ముందస్తు అరెస్టులో ఉన్న వారికి పూచీకత్తు ఇచ్చి విడిపించుకుని తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో కూడా నమోదైందని తెలిపారు. అదేవిధంగా వేంపల్లి ఆసుపత్రిలో పరామర్శ సమయంలోనూ 307 కేసులో నిందితుడిగా ఉన్న పేర్నపాడు సాంబశివారెడ్డి ఎంపీ పక్కనే ఉన్నారని పేర్కొంటూ, నిందితులు స్వేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఎవరికి వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు.చక్రాయపేటలో సుమారు 300 మంది వైసీపీ కార్యకర్తలు ట్రాక్టర్లలో బీరు సీసాలు, రాళ్లు, ఆయుధాలతో నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చి హల్‌చల్ చేశారని బీటెక్ రవి ఆరోపించారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ను టీడీపీ కార్యకర్తలపైకి ఎక్కించడంతో ఇద్దరి కాళ్లు విరిగాయని, మరొకరికి తలకు తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ఘటన జరిగినప్పటికీ ట్రాక్టర్‌ను, దాని డ్రైవర్‌ను పోలీసులు ఇప్పటివరకు అదుపులోకి తీసుకోకపోవడం ఏమిటని నిలదీశారు.144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో వందలాది మందితో నామినేషన్ కేంద్రాల వద్దకు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సతీష్ రెడ్డి 300 నుంచి 400 మందితో రావాలనుకుంటే పోలీసులు ఎలా అనుమతిస్తారని అన్నారు. మరోవైపు పులివెందుల, వేంపల్లి మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ చాలా వరకు ప్రశాంతంగా జరిగిందని, సింహాద్రిపురం మండలంలో కొన్ని చోట్ల అష్టమి తిథి కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదని వివరించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, చక్రాయపేట ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా 307 కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీలను బీటెక్ రవి డిమాండ్ చేశారు.

పి కృష్ణ. పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా