ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం
అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ : ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా, మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్బూరి శ్రీవాణి, పులిమి సుధాకర్ రెడ్డి లచే ప్రొసీడింగ్ అధికారి వెంకటసుబ్బయ్య గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నిర్వహణ ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలుగా చౌట భీమవరం ఎంపీటీసీ మెంబర్ అబ్బూరి శ్రీవాణి, ఉప మండల అధ్యక్షుడిగా అనుమసముద్రం ఎంపీటీసీ మెంబర్ పులిమి సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వారి చేత పివో వెంకటసుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసన్నకుమారి ,తహసిల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ మెంబర్లు ముంగమూరు వసంత, షేక్ దౌలత్, శాకం బాగ్యమ్మ, నంది పోగు అబ్రహం, సుగమంచి నరసింహులు, గొడుగునూరు విజయ్ కుమార్, మహమ్మద్ షాహినా బేగం,షేక్ ఖాదర్ భాష హాజరయ్యారు