మెదక్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ ప్రతినిధి ; మెదక్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు.గురువారం హైదరాబాద్ నుండి టూరిజం కార్పొరేషన్ మెంబర్స్ శ్రియా రెడ్డి, యాదగిరిలు మెదక్ పర్యాటక ప్రాంతాలను సందర్శించి తదుపరి మెదక్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ గారితో నేరుగా సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మెదక్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై డిపిఆర్ రూపొందించిన తీరుతెన్నులు టూరిజం అభివృద్ధి భవిష్యత్తు కార్యచరణ సంబంధించిన వివరాలను సుదీర్ఘంగా వివరించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పర్యాటక శోభ ఉట్టిపడేలా తుది మెరుగులు, తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిసిఓ ఎల్లయ్య, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు,ఈ డి యం సందీప్, గైడ్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.