ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది.....
ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' తుఫాను…
* అమలాపురం మేజర్ న్యూస్ నవంబర్ 20వ తేదీ తెల్లవారుజామున శ్రీకాకుళం ఉత్తర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచన వేస్తున్నారు తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండని అధికారులు తెలిపారు
ముఖ్యంగా తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. అధికారులు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు
రానున్న 24 నుంచి 36 గంటలు కీలకం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండలని భయపడాల్సిన అవసరం లేదన్నారు జాగ్రత్తలు పాటించడం మాత్రం మరచిపోవద్దని అధికారులు చెబుతున్నారు
రంబాల సత్యనారాయణ మేజర్ న్యూస్ అమలాపురం