BREAKING
వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి ఒరిస్సా కి చెందిన 7 గురు కార్మికులకు వెట్టి చాకిరి నుండి విముక్తి – DBRC కృషితో కదిలిన అధికార యంత్రాంగం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం

ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన..

Select Suryaa Now
ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన..
  • చిన్నారి వైద్య చికిత్సకు రూ.5.06 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సాయం మంజూరు
  • చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వైద్య ఖర్చుల భారం తగ్గించేలా చొరవ

పార్వతీపురం/సీతానగరం, సూర్య: ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తూ, వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్న ఐదేళ్ల చిన్నారి యమ్మల ఆశిష్‌కు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.5,06,528 ఆర్థిక సహాయం మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. సీతానగరం మండలం బూర్జ గ్రామానికి చెందిన యమ్మల మూలేశ్వరరావు కుమారుడు ఆశిష్ అనారోగ్యంతో విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి వైద్య చికిత్సకు భారీగా ఖర్చు అవుతుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను ఆశ్రయించారు.కుటుంబ పరిస్థితిని, చిన్నారి వైద్య చికిత్స ఆవశ్యకతను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం రూ.5 లక్షల6 వేల528 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ 2026 నవంబర్ 19న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సి) జారీ చేసింది.దీంతో చిన్నారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందే మార్గం సుగమమైంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమ కుటుంబానికి అండగా నిలిచి, చిన్నారి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సకాలంలో సహాయం అందేలా కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తూ ఎమ్మెల్యే ఈ విషయంలో చొరవ తీసుకున్నారు.