BREAKING
వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి ఒరిస్సా కి చెందిన 7 గురు కార్మికులకు వెట్టి చాకిరి నుండి విముక్తి – DBRC కృషితో కదిలిన అధికార యంత్రాంగం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం

125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్.

Select Suryaa Now
125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి :  అభినందించిన జిల్లా  కలెక్టర్.

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి 125 పుస్తకాలు బహుకరించిన యద్దనపూడి మండల విద్యాశాఖ అధికారి గోపిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐఏఎస్ అభినందించారు.

కలెక్టరేట్ ఉద్యోగుల్లో పఠనాసక్తిని పెంపొందించి, విజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రంథాలయానికి పుస్తకాలు అందించాలని ఆయన ఇచ్చిన పిలుపునకు స్పందించిన ఎంఈఓ గోపి, 125 పుస్తకాలను విరాళంగా అందించారు. గ్రంథాలయ అభివృద్ధికి గోపి అందించిన సహకారం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.