మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా
- నూతన ఎంపీపీ మరడాన నారాయణస్వామి
- ప్రజా సమస్యల పరిష్కారమే నాప్రథమ ప్రాధాన్యత..
- అధికారుల సమన్వయంతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..నారాయణస్వామి
గరుగుబిల్లి , సూర్య: గరుగుబిల్లి మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) నూతన అధ్యక్షుని గా మరడాన నారాయణస్వామి గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా ప్రజాప్రతి నిధులు, అధికారులు, స్థానిక నాయ కులు మరియు అభిమానులు ఎంపీపీ నారాయణస్వామికి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతల స్వీకరణ అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు.తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకుల కు, మండల ప్రజలకు,ఎంపీటీసీ సభ్యులకు ఎంపీపీ నారాయణస్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గరుగుబిల్లి మండల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాను.మండలంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కా రానికి ప్రత్యేక కృషి చేస్తానని పేర్కొన్నా రు.సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేస్తామని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడమే తమ ప్రధాన లక్ష్యమని నారాయణస్వామి స్పష్టం చేశారు.అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గరుగుబిల్లి మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మండ లంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఎంపీపీ మరడాన నారాయణస్వామి స్పష్టం చేశారు.ఈసమావేశంలో ఉప ఎంపీపీ అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.