BREAKING
బాచుపల్లి ప్లాట్ల ఈ-వేలంలో HMDAకు రూ.55.43 కోట్ల ఆదాయం దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్ మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు 'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత..

ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా

Select Suryaa Now
 ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు ,  డిసెంబర్ 22న తుది జాబితా

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

సమస్యాత్మక, తీవ్రసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల స్థితిగతులపై సమగ్ర విచారణతో విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు నివేదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు.
      
       గత ఎన్నికలలో జరిగిన సంఘటనలు, ఏ కారణాలతో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారో స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. ఆ కేంద్రాలు, 400 మంది ఓటర్లకు మించి ఉన్న కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు విద్యుద్దీకరణ చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పెద్దలతో వీఆర్వోలు సమావేశాలు నిర్వహించాలన్నారు. అన్ని సామాజిక వర్గాలు, మత పెద్దలతో సమావేశమై ఎన్నికలపై అవగాహన పెంచాలన్నారు.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర పరిశీలన తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలింగ్ కేంద్రాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి పరిశీలించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస వసతులు ఉండాలన్నారు.
     
     ఓటర్ల జాబితాను ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద  నోటీస్ బోర్డ్ లో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిశుభ్రంగా ఉండాలని, పెయింటింగ్ తప్పనిసరిగా చేయాలని, భద్రతా చర్యలపై నివేదిక పంపాలన్నారు. పంచాయతీలకు ఎన్నికల సామగ్రి తరలించేడానికి సర్వేయర్లు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. మూడో దశలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేయగా, పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఎన్నికల విధులకు నియమించిన యంత్రంగా గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రిజర్వులో 10% ఉద్యోగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 
     
     ఎస్ ఐ ఆర్ గడువు పొడుగింపు
          ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా దరఖాస్తుల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ప్రకటించారు. డిసెంబర్ 15 వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, మార్పులు చేర్పులపై దరఖాస్తులు స్వీకరించడం, పరిష్కరించడానికి అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రక్రియ వేగంగా చేపట్టాలని ఆర్డీఓలు, తహసిల్దార్లను ఆయన ఆదేశించారు. డిసెంబర్ 22వ తేదీన ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. 
          
         ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డిపిఓ నగేష్ కుమారి, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.