వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం
- ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన డోల బాబ్జి,
పాచిపెంట, సూర్య: వైయస్సార్ పార్టీ తరఫున మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పాచిపెంట 1వ సెగ్మెంట్ ఎంపీటీసీ, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి అన్నారు. గురువారం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు, మండల నాయకులు తో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడారు. దళిత నాయకుడునైన నాకు గౌరవించి ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరఫున అవకాశం ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొరకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచి ఓడామని పేర్కొన్నారు. పాచిపెంట రెండవ సెగ్మెంటు, మాతుమూరు, కేసలి, పాంచాలి సెగ్మెంట్లలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయామని అధికార పార్టీపై పోరాటం చేసి గట్టి పోటీని ఇచ్చామని తెలిపారు. నైతిక విజయం మాదేనని వెల్లడించారు. ఓటుకి తెలుగుదేశం పార్టీ 1000 నుంచి ₹2000 డబ్బులు విరజల్లిందని ఆ ప్రభావం ఓటర్ల పై చూపడంతో ఓటమి చూడవలసి వచ్చిందని తెలిపారు. మండలంలో వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు మంచి మద్దతు తెలిపారని పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎటువంటి అదైర్య పడొద్దని మాజీ వైస్ ఎంపీపీ టీ గౌరిశ్వ రరావు,,ఎంమధుసూదనరావు పేర్కొన్నారు.