BREAKING
ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు. : దర్శిలో ఎల్ఈడి స్క్రీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరా..పెద్ద మనసు చాటుకున్న ఎంపీ క్యాతనపల్లి 18వ వార్డులో ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల లో విజయం సాధించిన అభ్యర్థులతో మాట్లాడుతున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి ఒరిస్సా కి చెందిన 7 గురు కార్మికులకు వెట్టి చాకిరి నుండి విముక్తి – DBRC కృషితో కదిలిన అధికార యంత్రాంగం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి

వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి

Select Suryaa Now
వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి

తిరుపతి ,రెవెన్యూ, మేజర్ న్యూస్.

వెంకటగిరి ఎంపీపీ ఎన్నికలో కొట్టొచ్చిన అధికార దుర్వినియోగం.

వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి

వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను సరైన కారణం లేకుండా వాయిదా వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల నిర్ణయాలను అధికార బలంతో ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడమేనని ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా, పోలీసుల సహకారంతో ఎన్నికల్లో పోటీ చేయని అధికార పార్టీ వ్యక్తులను సైతం సమావేశ మందిరంలోకి అనుమతించడం ఆందోళన కలిగిస్తోందని ఎంపీ తెలిపారు. అనధికారికంగా లోపలకి ప్రవేశించిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ పరిణామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

ఎన్నికల నిర్వహణ అధికారిగా (ఆర్వో) వ్యవహరించిన వ్యక్తి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్నికను వాయిదా వేయడం కుట్రపూరితమని ఎంపీ అన్నారు. తన వ్యక్తిగత సహాయకుడిని సైతం సమావేశ మందిరంలోకి అనుమతించని పోలీసులు, అనధికారికంగా అధికార పార్టీ వ్యక్తులను లోపలికి అనుమతించడం వారి వైఫల్యానికి నిదర్శనమని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించడం అధికార యంత్రాంగం బాధ్యత అని గురుమూర్తి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభావితం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి తావివ్వకూడదని అన్నారు.

స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి పునాదులని, వాటి ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం తప్పనిసరిగా ఉండాలని ఎంపీ పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యులపై ఒత్తిళ్లు తీసుకురావడం, వారి స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తాయని అన్నారు. ప్రజల తీర్పును గౌరవించి, ఎన్నికైన ప్రతినిధులకు స్వేచ్ఛగా తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కల్పించాలని, వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి