దర్శిలో ఎల్ఈడి స్క్రీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్.
సూర్య న్యూస్ దర్శి.:దర్శి పట్టణంలోని ప్రధాన కూడలైన గడియార స్తంభం సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ను దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు, ప్రస్తుత చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు సమాచారం అందించడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యమైన ప్రకటనలు, వ్యాపార సంస్థల ప్రచార ప్రకటనలను ఈ ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రజలకు చేరవేయవచ్చని తెలిపారు.
స్థానిక వ్యాపారులు, వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలు, సంస్థల ప్రచారానికి ఈ స్క్రీన్‌పై ప్రకటనలు ప్రదర్శించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల వ్యాపార సంస్థలకు ప్రచార అవకాశం కలగడంతో పాటు పట్టణ ప్రజలకు కూడా ఉపయోగకరమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శి మండల ఎంపీపీ పోకూరి నారాయణస్వామి, కౌన్సిలర్లు గర్నెపూడి స్టీవెన్,నాయకులు శ్రీనుబాబు, బొగ్గరపు సుబ్బారావు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.