BREAKING
నెల్లిమర్ల ఎంపీపీ పీఠం కూటమి కైవసం ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు, * ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం కొత్తవలస ఎంపీపీగా కోళ్ల రమణమ్మ ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయలేం.. రామాయణం, పైర్ రెండింటినీ చూస్తారన్న ఇంతియాజ్ అలీ! ఉక్రెయిన్‌కు 45 బిలియన్ యూరోల రుణ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్వాగతం.. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల ఆదాయంతో నిధుల సమీకరణ! రాయదుర్గం తప్పిపోయిన 7వ తరగతి బాలుడిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు! వెల్దుర్తి పారిశ్రామికాభివృద్ధి రమేష్ శెట్టితోనే సాధ్యం ​రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ​గ్రామాభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మద్దతు: బొమ్మన దశరథరామిరెడ్డి ​నా ఎదుగుదలకు టీవీ శివయ్యే కీలకం: సంజన్న గౌడు ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి.. రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా శ్రీ దేవి దండుమారమ్మ 15వ వార్షికోత్సవం... చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం

గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్

Select Suryaa Now
గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్

కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కుంకనూరు గ్రామానికి చెందిన ఇ పుష్పావతి రామలింగేశ్వర గౌడ్ దంపతుల కుమారుడు ఈడిగ హర్షవర్ధన్ గౌడ్ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గురువారం నిర్వహించిన భారతీయ రహదారుల కాంగ్రెస్ (IRC) 85వ వార్షిక మహాసభల్లో కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జాతీయ పురష్కా రాన్ని అందుకున్నారు.హర్షవర్ధన్ గౌడ్ తల్లిదండ్రులు జీవనోపాధి కొరకు సుదూర ప్రాంథానికి వెళ్లడంతో కుంకనూరు గ్రామంలో ఉంటున్న తన నాన్నమ్మ వెంకటలక్ష్మి రామదాసు గౌడ్ సహకారంతో చదువులో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. తన ప్రతిభతో భారతీయ రహదారుల నిర్మాణంలో బిటుమెన్ పనితీరు ఆధారిత ప్రమాణాల అభివృద్ధికి సంబంధించిన (“Development of Performance-Based Binder Rutting Specifications for India”) అనే పరిశోధనా పత్రానికి ఈ అవార్డు లభించింది.ఈ పరిశోధనా పత్రాన్ని ప్రొఫెసర్ విష్ణు రాధాకృష్ణన్, గొట్టుముక్కల భరత్, ప్రొఫెసర్ కె. సుధాకర్ రెడ్డి సంయుక్తంగా రచించారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన హర్షవర్ధన్ గౌడ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం కుంకనూరు గ్రామానికి, కర్నూలు జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.ప్రతిభ ఉంటే గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయిలో కూడా అవార్డులు సాధించవచ్చని నేటి యువతకు హర్షవర్ధన్ గౌడ్ ఆదర్శంగా నిలిచారు.