ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి..
- మహిళలు ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
- గురాన అయ్యలు–రాధిక
విజయనగరం, సూర్య: బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యసాహసాలు, పోరాట పటిమ ప్రతి మహిళకు ఆదర్శమని జనసేన నాయకులు గురాన అయ్యలు, గురాన రాధిక దంపతులు అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు, రాధిక మాట్లాడుతూ.. మాతృభూమి రక్షణ కోసం ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె ధైర్యం, తెగువ, దేశభక్తి, పోరాట స్ఫూర్తిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో జనసేన పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొన సాయి,మీసాల ఆషా, అనూష, ననీన్ కుమార్, పవన్ కుమార్, మహేష్,తరుణ్ , చందూ, హరి, నాగ, వెంకటేష్, అప్పలనాయుడు, సురేష్ , సాయి, సూర్యచంద్రులు, తదితరులు పాల్గొన్నారు.