మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా బొత్స అమ్మోజమ్మ . వైస్ ఎంపీపీ గా బలిజిరెడ్డి నరిసింగరావు
వంగర, సూర్య: మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) నూతన అధ్యక్షురాలిగా బొత్స అమ్మోజమ్మ గురువారం ఎన్నుకోబడ్డారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల అధికారి పి చంద్ర కుమారి ఆధ్వర్యంలో ఎంపీటీసీ లతో ఎన్నుకోబడ్డ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బొత్స అమ్మోజమ్మ ఎన్నికైన అనంతరం
అమ్మోజమ్మ బొత్స వాసుదేవరావు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు, ఎంపీటీసీసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే తన ప్రథమ కర్తవ్యమని ఆమెపేర్కొన్నారు. ముందుగా
మండల పరిధిలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతనంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ 12 మంది ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశ మందిరములో ప్రొసీడింగ్ అధికారి పి. చంద్రకుమారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోట్టిశ ఎంపిటిసిగా కమలమ్మ. మరువాడ ఎంపీటీసీగా బలిజిరెడ్డి నరసింగరావు. పటు వర్ధనం ఎంపీటీసీగా బొత్స అమ్మోజమ్మ. వంగర ఎంపీటీసీగా బొత్స వాసుదేవరావు నాయుడు. తలగాం ఎంపీటీసీగా దాసు బోనేల. కోనంగిపాడు ఎంపీటీసీగా బౌరోతు రాంబాబు. అరసాడ ఎంపీటీసీగా మజ్జి గౌరమ్మ. రుషింగి ఎంపిటిసిగా ఎలకల చిన్నమనాయుడు. శ్రీహరిపురం ఎంపీటీసీగా. సతి పిడకల పావణ. కొప్పర ఎంపీటీసీగా సిరిపురం లలిత కుమారి. వివి ఆర్ పేట ఎంపీటీసీగా మరిచర్ల విజయలక్ష్మి. శివ్వాం ఎంపీటీసీగా బొడ్రోతు శ్రీనివాసరావు. ఎన్నికయ్యారు.ఎన్నికైన 12 మంది ఎంపీటీసీ సభ్యులను సాదరంగా ఆహ్వానించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మండల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని నూతనంగా ఎన్నుకోబడ్డ.ఎంపీటీసీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి రాజారావు. ఎం వి ఎస్ కే ప్రసాద్. డిప్యూటీ ఎంపీడీవో కేల్ల రామారావు. ఎంపీడీవో సిబ్బంది, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.