BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

శర్వానంద్ భోగి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 27న థియేటర్లలో మాస్ జాతర!

Select Suryaa Now
శర్వానంద్ భోగి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 27న థియేటర్లలో మాస్ జాతర!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హీరో శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా భోగి కొత్త విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సెన్సార్ ప్రక్రియల కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం, అన్ని అడ్డంకులను అధిగమించి నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. డిసెంబర్, జనవరి నెలల్లో భారీ చిత్రాల పోటీ నేపథ్యంలో నవంబర్ 27 సరైన సమయంగా భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మునుపెన్నడూ కనిపించని ఊరమాస్, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్ గంగా అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. 1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథలో భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను సంపత్ నంది సమపాళ్లలో మేళవించినట్లు సమాచారం.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా, సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో విడుదలకు మార్గం సుగమమైంది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది.