డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి
నవాబుపేట సూర్య న్యూస్: మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి సోదరుడు జనంపల్లి దుష్యంత్ రెడ్డి నియమితులైన సందర్భంగా నవాబుపేట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తానెం సురేష్,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం,వాసు యాదవ్,సిద్ధు తదితరులు మాట్లాడుతూ..దుష్యంత్ రెడ్డికి డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి దక్కడం సంతోషకరమని అన్నారు.ఆయన నాయకత్వంలో సహకార బ్యాంకు మరింత అభివృద్ధి చెందడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా దుష్యంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.