BREAKING
15 వ వార్డు అభివృద్ధి దిశగా కృషి - కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక మండల అభివృద్ధే నా లక్ష్యం. శ్రీనివాస్ క్షేత్రంలో లక్ష తులసి దళాల పూజపూజ వాకర్స్ ఆరోగ్య పరిరక్షణకు కిమ్స్ ఉచిత వైద్య శిబిరం.... పుస్తక పఠనంతో మానసిక వికాసం -భవిష్యత్తు నిర్మాణంలో గ్రంథాలయాలది కీలక పాత్ర -గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో డీఈఓ శివకుమార్ జడ్పీ చైర్‌పర్సన్‌గా కొరికాన భవాని ప్రమాణ స్వీకారం మెల్లకన్నును గుర్తించండి - చిన్నారులకు అండగా నిలవండి - ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ వైద్య నిపుణులు మేయర్ అభ్యర్థి సహా ప్రతి డివిజన్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందాలి సైకిల్ గుర్తుకి ఓటు వేయండి ఎస్పీడబ్ల్యూలో విద్యార్థి సంఘం ఎన్నిక ఘనంగా ఏకాహోమ పూజలు - భక్తి పారవశ్యంలో పలాస. ఆమదాలవలస వైస్ ఎంపీపీగా వండాన శ్రీదేవి పలాస కు అరుదైన గౌరవం. కోటబొమ్మాళి జడ్పీటీసీగా పూజారి శైలజ ప్రమాణస్వీకారం

కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు!

Select Suryaa Now
కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు!

పరిగి మండలం కోడిగేనహళ్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం తరఫున సర్పంచ్ అభ్యర్థి రేసులో పెద్దిరెడ్డిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, అనేక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం దక్కితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

పదవి లేకున్నా ప్రజలకు అండగా..

రాజకీయాల్లో పదవులు వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేస్తామని చెప్పేవారు చాలామంది ఉంటారు. కానీ పదవితో సంబంధం లేకుండా తనకు చేతనైనంత సహాయం చేస్తూ ప్రజల కష్టాల్లో భాగస్వామి కావడం ప్రవీణ్ రెడ్డి ప్రత్యేకతగా ఆయనకు సన్నిహితులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరమైన సమయంలో సహాయం అందించడం వంటి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారని పేర్కొంటున్నారు.

విద్యార్థుల భవిష్యత్తుకు కంప్యూటర్ల వితరణ..

నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని గుర్తించిన ప్రవీణ్ రెడ్డి నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్లు అందించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కేవలం తన పరిధిలోనే కాకుండా విదేశాల్లో స్థిరపడిన తన క్లాస్‌మేట్స్, స్నేహితులతో సైతం మాట్లాడి అవసరమైన వారికి సహాయం అందించే ప్రయత్నం చేస్తుండటం ఆయన సేవా తత్వానికి నిదర్శనమని అంటున్నారు.

కష్టమొస్తే ముందుండే నాయకుడనే గుర్తింపు..

ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తనకు తెలిసిన మార్గాల్లో పరిష్కారం చూపేందుకు ప్రయత్నించడం, పార్టీ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా సహకారాలు అందించడం ప్రవీణ్ రెడ్డికి ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు అదనపు బలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.

ఈసారి అవకాశం ఇస్తే విజయం ఖాయమనే ధీమా!

కోడిగేనహళ్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ప్రజల మద్దతు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది. ఇతర పేర్లతో పోలిస్తే ప్రవీణ్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆయన సేవా కార్యక్రమాలే ఎన్నికల్లో ప్రధాన బలంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ముందుకు సాగుతున్న యువ నాయకుడికి ఈసారి గ్రామ పాలనలో అవకాశం కల్పించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

 

 పరిగి సూర్య రిపోర్టర్ నవీన్….