BREAKING
భర్త మత్తుమందు ఇచ్చి వేధించిన కేసు..నలుగురు బ్రిటన్ వ్యక్తులకు దోషిగా తీర్పు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారాలు.. మూత్రపిండాల రక్షణకు వైద్యుల సూచనలు! రెండేళ్ల వేతన స్తబ్ధత, పని గంటల సవరణకు వోక్స్‌వ్యాగన్ డిమాండ్ ఆఫ్రికాలో రష్యా 'ఏ7' చెల్లింపుల వ్యవస్థ విస్తరణ.. నైజీరియా, జింబాబ్వే తర్వాత మరిన్ని దేశాలపై మాస్కో దృష్టి! బుట్టాయిగూడెం మండల పరిషత్ అధ్యక్షులుగా కొమరం మల్లేశ్వర రావు ఇండోనేషియా–చైనా మధ్య 71.8 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలు.. దేశవ్యాప్తంగా పది స్మార్ట్ సిటీల నిర్మాణం! శిలాజ ఇంధనాలు, ఏఐ విద్యుద్దీకరణపై కాప్31లో భిన్నాభిప్రాయాలు మహిళల భద్రత, ర్యాగింగ్ నిరోధం, మాదక దవ్యాల వలన జరిగే పరిణామాలపై అవగాహన గ్యాస్ ధరల పెరుగుదలతో జర్మనీ విద్యుత్ వ్యయం 16 బిలియన్ యూరోలు అదనం అమెరికా ఔషధ సంస్థ ఇన్‌స్మెడ్ కొనుగోలుపై సనోఫీ ఆలోచన వారణాసి క్రికెట్ స్టేడియం డమరుకం డిజైన్‌కు జై షా ఫిదా.. డిసెంబర్ నాటికి మ్యాచ్‌లకు సిద్ధం! ఎన్విడియా షేర్లలో ట్రంప్ పెట్టుబడులు.. తాజా నివేదికలో కీలక వివరాలు దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి

మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.

Select Suryaa Now
మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.

 

బెలుగుప్ప: మండలం బ్రాహ్మణపల్లి తాండా సమీపంలోని బెలుగుప్ప రిజర్వ్ ఫారెస్ట్‌లో చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. యలగలవంక గ్రామానికి చెందిన మాలక్క హత్య కేసులో ఆమె మరిది గొల్ల గోవిందును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ కలహాలు, డబ్బుల వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీ ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తాండా సమీపంలోని బెలుగుప్ప రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 743లో మాలక్క హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టి అనుమానితులపై దృష్టి సారించారు. విచారణలో మృతురాలు మాలక్కకు సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహమైనట్లు, అయితే సంతానం కలగకపోవడంతో భర్త ఆమెను విడిచిపెట్టి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి మాలక్క ఒంటరిగా జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెకు తన మరిది గొల్ల గోవిందుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారం కారణంగా నిందితుడి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సుమారు నాలుగు నెలల క్రితం వెంకటేష్ తన ఇంటిని రూ.4 లక్షలకు విక్రయించగా, అందులో నుంచి మాలక్కకు రూ.20 వేల నగదు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న గొల్ల గోవిందు ఆ డబ్బులను తనకు ఇవ్వాలని మాలక్కను కోరినట్లు, ఆమె అందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కుటుంబ కలహాలు కొనసాగుతుండటంతో పాటు డబ్బుల విషయంలోనూ గొడవ జరగడంతో నిందితుడు మాలక్కపై కక్ష పెంచుకున్నట్లు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 18వ తేదీ ఉదయం మాలక్కను తన ద్విచక్ర వాహనంపై బెలుగుప్ప రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ రాళ్లతో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు నిందితుడి పాత్రపై పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఉరవకొండ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.ఈరన్న గురువారం (19.11.2026) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎన్.గుండ్లపల్లి గ్రామ సమీపంలో రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వెళ్లే ఎన్‌హెచ్‌-544-డీడీ జాతీయ రహదారి పక్కన ఉన్న బస్టాప్ వద్ద గొల్ల గోవిందును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కళ్యాణదుర్గం కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. మహిళ హత్య కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో కీలక పురోగతి సాధించినట్లయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.