BREAKING
పుస్తక పఠనంతో మానసిక వికాసం -భవిష్యత్తు నిర్మాణంలో గ్రంథాలయాలది కీలక పాత్ర -గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో డీఈఓ శివకుమార్ జడ్పీ చైర్‌పర్సన్‌గా కొరికాన భవాని ప్రమాణ స్వీకారం మెల్లకన్నును గుర్తించండి - చిన్నారులకు అండగా నిలవండి - ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ వైద్య నిపుణులు మేయర్ అభ్యర్థి సహా ప్రతి డివిజన్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందాలి సైకిల్ గుర్తుకి ఓటు వేయండి ఎస్పీడబ్ల్యూలో విద్యార్థి సంఘం ఎన్నిక ఘనంగా ఏకాహోమ పూజలు - భక్తి పారవశ్యంలో పలాస. ఆమదాలవలస వైస్ ఎంపీపీగా వండాన శ్రీదేవి పలాస కు అరుదైన గౌరవం. కోటబొమ్మాళి జడ్పీటీసీగా పూజారి శైలజ ప్రమాణస్వీకారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కొరికాన భవానీకి మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు మేయర్‌గా కుమార్తె ప్రమాణ స్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత ఆదివాసీ గిరిజన మహిళకు దక్కిన అరుదైన గౌరవం. వైఎస్సార్‌సీపీలోకి మాజీ సర్పంచ్.. వనాలు మానవ మనుగడకు ఆధారం -వృక్షాలను దైవ స్వరూపాలు భావించాలి డా.ఎన్.సత్యనారాయణ రాజు

కూరకులపల్లి లో వైయస్సార్ విగ్రహం వస్త్రానికి నిప్పు కేసు నమోదు.

Select Suryaa Now
కూరకులపల్లి లో వైయస్సార్ విగ్రహం వస్త్రానికి నిప్పు కేసు నమోదు.

కంబదూరు మండలం కురాకులపల్లి గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి కప్పిన తెల్లటి వస్త్రానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలులో భాగంగా వైఎస్సార్ విగ్రహానికి తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఆ వస్త్రానికి నిప్పు పెట్టడంతో అది పాక్షికంగా కాలిపోయింది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కంబదూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరు, ఏ కారణంతో ఈ చర్యకు దిగారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధ్యులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కంబదూరు ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలపై వివాదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని హెచ్చరించారు. ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా, నిప్పు పెట్టిన వ్యక్తులు ఎవరన్నది తేలాల్సి ఉంది.