BREAKING
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

మేయర్‌గా కుమార్తె ప్రమాణ స్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

Select Suryaa Now
మేయర్‌గా కుమార్తె ప్రమాణ స్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

అక్కయ్యపాలెం, మేజర్ న్యూస్ : విశాఖ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు (శుక్రవారం) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది.1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచే పార్టీతో అనుబంధం కలిగి ఉన్న ముత్యాల నాయుడు, పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ కార్పొరేటర్‌గా ప్రజలకు సేవలందించారు. టీడీపీ బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. దివంగత ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. అనంతరం ఆయన కుమారుడు ముక్కా కిశోర్, కుమార్తె ముక్కా శ్రావణి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో ఆయన కుమార్తె ముక్కా శ్రావణి మేయర్‌గా ఎన్నిక కావడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ నెల 23న ఆమె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కుమార్తె నగర ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టే అపురూప ఘట్టాన్ని కళ్లారా చూడాలన్న తండ్రి ఆశ నెరవేరకుండానే ఆయన కన్నుమూయడం కుటుంబ సభ్యులను కలచివేసింది.  ఒకవైపు కుమార్తె మేయర్‌గా ఎన్నికైన ఆనందం.. మరోవైపు తండ్రి ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ముత్యాల నాయుడు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.