వైఎస్సార్‌సీపీలోకి మాజీ సర్పంచ్..
పోలాకి నవంబర్ 20 మేజర్ న్యూస్ :
పోలాకి మండలం తలసముద్రం పంచాయతీ మాజీ సర్పంచ్ బావన ప్రసాద్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి , జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ చేరికతో తలసముద్రం పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం కానుంది. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి బావన వైకుంఠరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బెలమాన గెడ్డెయ్య , ముద్దపు ప్రకాష్ , పొందరి నారాయణ , బావన సద్గుణమూర్తి , ముద్దాపు సూరిబాబు , బావన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.