BREAKING
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

ఆదివాసీ గిరిజన మహిళకు దక్కిన అరుదైన గౌరవం.

Select Suryaa Now
ఆదివాసీ గిరిజన మహిళకు దక్కిన అరుదైన గౌరవం.


*25సంవత్సరాలు తర్వాత జనసేన లో గుర్తింపు.
*మారుమూల ఎతైన కొండల్లో నివసించే మహిళకు అవకాశం.
కొత్తూరు నవంబర్ 20(మేజర్ న్యూస్) ఒడిశా ఆంధ్ర సరిహద్దులో ఎతైన కొండల్లో నివసించే ఆదివాసీ గిరిజన మహిళ నిమ్మల నీలిమ కు జనసేన పార్టీ నుండి అరుదైన గౌరవం దక్కింది. పూర్వపు కొత్తూరు నియోజకవర్గం పరిధిలో గల భామిని మండలం 
మనుమకొండ ఆదివాసీ గిరిజన గ్రామానికి చెందిన నిమ్మల నీలిమ పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టడం విశేషం.కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన నీలిమ కు జడ్ పి చైర్మన్ పదవికి ఎంపిక చేసింది.
పూర్వపు కొత్తూరు నియోజకవర్గం వర్గం పరిధిలో ఉన్న భామిని మండలం జిల్లాల పునర్విభజన లో పార్వతీపురం మన్యం జిల్లాలో పరిది లోనికి వెళ్లి పోయింది.ఈ నేపథ్యం లో భామిని మండలం మనుముకొండ కు చెందిన నిమ్మల నీలిమ కు ఏకంగా జడ్ పి చైర్మన్ పదవి చేపట్టడం తో వెనుక బడిన భామిని మండల లో ప్రజలు  పార్టీలకు అతీతంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా కు ఆనుకొని ఉన్న భామిని మండలం అభివృద్ధి లో ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.స్వాతంత్య్రం వచ్చి డబ్బయి ఏళ్లు గడుస్తున్న అభివృద్ధి కనుచూపు మేరలో కన్పించడం లేదు.ఈ మండలం ఒకప్పుడు నక్సల్స్ ఉద్యమం 
వలన అభివృద్ధి వెనుక బడి ఉందనే చెప్పవచ్చు. నీలిమ భర్త నిమ్మల నిబ్రం 2001 లో తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి గా 
ఎన్నికైయ్యారు. 2024 జరిగిన ఎన్నికలు ముందు తెలుగుదేశం నుండి జనసేన లో చేరి చురుకైన నాయకుడు కొనసాగుతున్నారు. మాజీ ఎంపి కురుపాం సంస్థాన దీసుడు వైరి చర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ మనవడు వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ పోటీ పడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధారణ గిరిజన మహిళ కు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.