BREAKING
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

వనాలు మానవ మనుగడకు ఆధారం -వృక్షాలను దైవ స్వరూపాలు భావించాలి డా.ఎన్.సత్యనారాయణ రాజు

Select Suryaa Now
వనాలు మానవ మనుగడకు ఆధారం  -వృక్షాలను దైవ స్వరూపాలు భావించాలి  డా.ఎన్.సత్యనారాయణ రాజు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : భారతీయ విద్యాభవన్ శ్రీవేంకటేశ్వర విద్యాలయంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని కార్తిక వనారాధన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సంచాలకులు, కోశాధికారి డా.ఎన్.సత్యనారాయణ రాజు మాట్లాడుతూ డా. కె.ఎం.మున్షి భవిష్యత్తును ఊహించి జనాభా పెరుగుదలకు అనుగుణంగా మొక్కలు నాటాలని ఆలోచించి వనారాధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. భగవద్గీతలో 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఊర్ధ్వమూలమధఃశాఖలో వృక్షాల గురించి ఉందని తెలిపారు. వనాలు మానవ మనుగడకు ఆధారమని, మన సంస్కృతిలో వృక్షాలను దైవ స్వరూపాలుగా భావించి వాటిని పూజ చేస్తూ ఆరాధిస్తారని తెలియజేశారు. చెట్ల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, భారతీయ విద్యా భవన్ ప్రాంగణంలో రావి, మర్రి, వేప, ఉసిరి, బిల్వం మొదలైన వృక్షాలు అనేకం ఉన్నాయని తెలియజేసి వాటికి పూజలు నిర్వహించారు. ఎనిమిదవ తరగతి విద్యార్థులచే మొక్కలకు దీపారాధన చేయించారు. తదుపరి కార్తిక వనభోజనాలు ఏర్పాటు చేశారు. భారతీయ విద్యా భవన్ కమిటీ సభ్యులు, పాఠశాల యాజమాన్యం, రామకృష్ణ మిషన్ ఆశ్రమానికి చెందిన అమర అధిపానంద స్వామి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు డి.పద్మజ, ఉప ప్రధానోపాధ్యాయురాలు, ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్