BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. ఎమ్మెల్యే

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. ఎమ్మెల్యే

రాజాం, సూర్య: రెండు దశాబ్దాల తరువాత జరగనున్న రాజాం మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని,పట్టణంలో కూటమి విజయమే లక్ష్యంగా అభ్యర్థులు,పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. రాజాం మండలం శ్యాంపురంలోని తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిల్ అభ్యర్థులకు ఆయన బి- ఫామ్ లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజాం జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థి సౌజన్యలతతో పాటు 32 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు.ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టి,ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వంలో చేసిన పట్టణ అభివృద్ధి లక్ష్యాలను వివరించడంతో పాటు, ప్రజల ఆదరణ,ఆశీర్వాదం పొందాలని కోరారు.21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న రాజాం మున్సిపల్ ఎన్నికలు పట్టణ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవనున్నాయని పేర్కొన్నారు.ఈ ఎన్నికల ప్రాధాన్యతను ప్రతి అభ్యర్థి గుర్తించి,విజయమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో శ్రమించాలని అన్నారు.గాయత్రీ కాలనీకి చెందిన పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.వీరిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు వేసి, మున్సిపల్ ఎన్నికల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.