BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

భోగాపురం ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ!

Select Suryaa Now
భోగాపురం ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ!

భోగాపురం, సూర్య భోగాపురం మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం ఎవరిని వరించనుందన్న అంశం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గురువారం ఎంపీపీ ఎన్నికకు రంగం సిద్ధమైనప్పటికీ, కీలకమైన ఎంపీటీసీ సభ్యుల గైర్హాజరుతో ఎన్నిక ప్రక్రియ మరుసటి రోజుకు వాయిదా పడింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, వైసీపీ నుంచి గెలుపొందిన ఆరుగురు సభ్యులు మాత్రమే ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు హాజరయ్యారు. జనసేనకు చెందిన ముగ్గురు, టీడీపీకి చెందిన ముగ్గురు, నలుగురు స్వతంత్ర సభ్యులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో ఎన్నిక నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఎన్నికను శుక్రవారం కు(నేటికి) వాయిదా వేసినట్లు ప్రొసీడింగ్ అధికారి ఎం. రామారావు ప్రకటించారు.
* స్వతంత్రులే కీలకం..
మండలంలోని మొత్తం 16 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను పరిశీలిస్తే వైసీపీ ఆరు స్థానాలు, టీడీపీ మూడు, జనసేన మూడు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. ఈ సంఖ్యాబలం ప్రకారం ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో ఎంపీపీ పీఠం దక్కించుకోవాలంటే స్వతంత్ర సభ్యుల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా వైసీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉండగా, మరో నాలుగు స్వతంత్రుల మద్దతు ఎటువైపు ఉంటుందన్నది రాజకీయ సమీకరణాలను నిర్ణయించనుంది.
* జనసేనకు అధిష్టానం మద్దతు.. టీడీపీతో సమన్వయం?
కూటమి రాజకీయాల్లో భాగంగా భోగాపురం ఎంపీపీ పీఠాన్ని జనసేనకు కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు కేవలం మూడు స్థానాలే దక్కడం, టీడీపీకి కూడా మూడు స్థానాలే రావడంతో ఇరు పార్టీల మధ్య పరస్పర మద్దతు, సమన్వయం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థికి టీడీపీ సభ్యుల మద్దతు లభిస్తుందా? మరోవైపు నలుగురు స్వతంత్ర సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
* స్వతంత్రులతో మంతనాలు.. రైతుల అంశం ప్రస్తావన!
స్వతంత్ర సభ్యుల మద్దతు కూడగట్టేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. భోగాపురం-1, భోగాపురం-2 స్థానాల నుంచి గెలుపొందిన స్వతంత్ర సభ్యులతో చర్చలు జరిపేందుకు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లోకం నాగమాధవితో పాటు పలువురు నాయకులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్వతంత్ర సభ్యులు తమ రాజకీయ వైఖరిని స్పష్టం చేస్తూ, భోగాపురం ప్రాంత రైతుల సమస్యలు, భూముల అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా స్వతంత్రులుగా బరిలోకి దిగామని, ఇప్పటివరకు రైతుల సమస్యలపై స్పష్టమైన మద్దతు ప్రకటించని నాయకులు ఇప్పుడు తమ మద్దతు కోరడం ఏమిటని వారు ప్రశ్నించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర సభ్యులను ఒప్పించి జనసేన అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు కొందరు నాయకులు మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు సమాచారం.
* రేపటి నిర్ణయంపైనే అందరి దృష్టి..
ఒకవైపు అధిష్టానం నిర్ణయం, మరోవైపు స్థానిక రాజకీయ సమీకరణాలు, ఇంకోవైపు రైతుల సమస్యలపై స్వతంత్రుల వైఖరి.. ఇలా భోగాపురం ఎంపీపీ ఎన్నిక అనేక మలుపులు తిరుగుతోంది. జనసేనకు మద్దతు ప్రకటిస్తారా? టీడీపీ వైపు మొగ్గు చూపుతారా? లేక స్వతంత్రంగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అన్నది ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చివరి నిమిషం వరకు సాగుతున్న ఈ రాజకీయ మంతనాలకు రేపటి ఎంపీపీ ఎన్నికతో తెరపడనుంది. స్వతంత్రుల నిర్ణయం భోగాపురం మండల పరిషత్ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.