BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

మండల ఉపాధ్యక్ష పదవి పై గందరగోళం

Select Suryaa Now
మండల ఉపాధ్యక్ష పదవి పై గందరగోళం


పూసపాటిరేగ, నవంబరు 19, మేజర్ న్యూస్: పూసపాటిరేగ మండల పరిషత్ లో గురువారం జరిగిన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై ఎంపీటీసీలతో ఆర్వో గోపి అధ్యక్షతన సమావేశం జరగగా బిపారాల విషయంలో గందరగోళంకి దారి తీసి చివరికి ఉపాధ్యక్ష పదవిపై తీవ్ర రభస జరగడంతో ఎన్నికల అధికారి గోపి ఉపాధ్యక్షునిగా రెల్లివలస 1 ఎంపీటీసీ సభ్యుడు మహంతి శ్రీనివాసరావుకు ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందించడంతో కూటమి పార్టీల్లో కొంపటి రేపినట్లు అయింది. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు ఆయా పార్టీల నుంచి వచ్చి ఫీల్డ్ కవర్లను సభ్యుల సమక్షంలో ఆర్వో గోపి ఓపెన్ చేయగా జనసేన పార్టీ తరఫున అధ్యక్ష పదవికి బీ ఫారం  అందినట్లు పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి సామలమ్మకు ఇద్దరు సభ్యులు ఉన్నప్పటికీ వారు ప్రతిపాదించడం గాని, బలపరచడం గాని చేయకపోవడంతో వైకాపాకు చెందిన వారికి బీఫారం రావడంతో వారి తరుపున మహంతి శ్రీనివాసరావు పేరును ప్రకటించినప్పటికీ 7కరి సభ్యుల మద్దతు చాలక పోవడంతో బీఫారం లేని తెదేపా సభ్యులకు సభ్యులందరూ కలిసి తమ్ము నాయుడును అధ్యక్షుడిగా చేతులెత్తే విధానం ద్వారా ప్రకటించగా, జనసేన తరఫున ఉన్న ముగ్గురు సభ్యులు కూడా దమ్మునాయుడికే మద్దతు ప్రకటిస్తూ చేతిలెత్తడంతో అధ్యక్ష పీఠంపై సమస్య తొలగింది. అయితే ఉపాధ్యక్షులు ఎన్నికల్లో మాత్రం తీవ్ర గందరగోళానికి దారితీసింది. జనసేన గాని, తేదాపాకు గాని ఆయా పార్టీల తరఫున బీఫారాలు లేకపోవడంతో వైకాపాకు చెందిన ఎంపీటీసీ సభ్యులుగా ప్రమాణం చేసిన వారు పట్టుబట్టారు. రెల్లివలస ఎంపీటీసీ శ్రీనివాసరావు అధ్యక్ష పీఠం తెదేపాకు చెందిన తమ్మునాయుడు కు బి ఫారం లేకపోయినా ఆర్వోగా తమను ఇబ్బంది పెట్టలేదని, ఉపాధ్యక్ష పదవి కూడా కోటములో ఉన్న ఇరు పార్టీలకు దీపారాల లేకపోవడంతో ఆ పదవిని ఎనిమిది మంది సభ్యులు ఉన్న తమకే దక్కే విధంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలంటూ శ్రీనివాసరావు తో పాటు మిగిలిన సభ్యులందరూ పోడియం వద్దకు వచ్చి ప్రిసైడింగ్ అధికారులతో వివాదానికి దిగారు. దీపారాలేని వారికి పదవులు ఎలా ఇస్తారంటూ తీవ్ర అలజడి నెలకొనడంతో సభ గంటపాటు నిలిచిపోయింది. దీనితో ఆర్వో బీ పారాలు లేకపోయినప్పటికీ ఆయా పార్టీలకు పదవులు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని శ్రీనివాసరావుకు నచ్చచెప్పినప్పటికీ అలా అయితే రిటర్న్ గా రాసి ఇవ్వాలంటూ పట్టు పట్టడంతో ఎటు ఆర్వో తేల్చుకోలేకపోయారు. ఆ సమయంలో కూటములో ఉన్న ఇరు పార్టీలకు చెందిన వారు మౌన ప్రేక్షక పాత్ర వహించడంతో ఆర్వో గోపి విధిలేని పరిస్థితుల్లో వైకాపాకు చెందిన మహంతి శ్రీనివాసరావుకు ఉపాధ్యక్ష పదవి వైకాపా సభ్యుల ఆమోదంతో ప్రకటిస్తున్నట్లు పేర్కొనడమే కాకుండా. అధ్యక్షుడిగా తమ్మునాయుడు తో పాటు ఉపాధ్యక్షుడిగా మహంతి శ్రీనివాసరావుకు ధ్రువీకరణ పత్రాలు అందించి సభను అర్ధాంతరంగా ముగించారు. 
సభ ముగిసిన ఐదు నిమిషాలకే ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మండల పరిషత్ కు చేరుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆర్ఓ గోపి ని కలిసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా ఓ గదిలో ఏకాంతంగా ఉండిపోవడంతో ఎమ్మెల్యే మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరకు ఎంపీడీవో రాధిక పై రూమ్ లో ఉన్నట్లు చెప్పడంతో ఆ గదికి వెళ్లి ఉపాధ్యక్ష పదవి విషయంలో ఎందుకు తప్పిదం చేశారంటూ ఆర్ ఓ గోపీని ఎమ్మెల్యే నిలదీశారు. సమావేశం మూడు గంటలకు నిర్వహించాల్సి ఉండగా పది నిమిషాలు ముందే ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో చెప్పాలంటూ ఆర్ ఓ తీరును తప్పు పట్టారు. కూటమిలో ఉన్న తెదేపా వారు అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు, మెజార్టీ సభ్యులు తెదేపా జనసేన ఉన్నప్పుడు వైకాపాకు ఆ పదవి ఇందుకు ఇవ్వాల్సింది వచ్చిందో అంటూ ఆరో తీరుపై ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా చేరుకొని అక్కడ జరుగుతున్న పీరును క్షుణ్ణంగా పరిశీలించారు. తమ్ము నాయుడును కూడా ఎమ్మెల్యే పిలిపించుకొని బీఫారం లేకపోయినా మంత్రి నిర్ణయం మేరకు అధ్యక్ష పదవిని కట్టబెట్టినప్పుడు జనసేనకు ఉపాధ్యక్ష పదవిపై ఎందుకు సహకరించలేదంటూ తమ్మి నాయుడు తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన కు చెందిన చింతపల్లి ఎంపీటీసీ బర్రి సామలమ్మ కూడా తెదేపా సపోర్ట్ చేయకపోవడం వలన తనకు పదవి దక్కలేదు అంటూ ఎమ్మెల్యే వద్ద తన అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనితో కూటమికి చెందిన 13 మంది సభ్యులు ఉపాధ్యక్ష పదవి విషయంలో అన్యాయం జరిగినందున అది చెల్లుబాటు కాదంటూ కలెక్టర్ తో పాటు ఎస్ ఇ సి కి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొనడమే కాకుండా. జిల్లా అధికారులు కూడా శుక్రవారం ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయంటూ ఎమ్మెల్యేకు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగినట్లు అయింది.