హై సినిమా నుంచి సూపర్ 5 సాంగ్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదల!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి వద్ద పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పనిచేసి గుర్తింపు పొందిన ఎస్ కృష్ణ, హై సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు రచయితగా, నటుడిగా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సూపర్ 5 లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
సినిమాలోని ప్రధాన బృందాన్ని పరిచయం చేస్తూ సాగే ఈ పాట ఉత్సాహభరితమైన బీట్స్, ఆకట్టుకునే ట్యూన్‌తో శ్రోతలను అలరిస్తోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వికాస్ బడిస సంగీత బాణీలు, అద్వైత్ గానం కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పిల్లల కోరస్ కూడా తోడవడంతో ఇప్పటికే విడుదలైన రెండు పాటల తరహాలోనే ఈ గీతానికి కూడా మంచి స్పందన లభిస్తోంది.
ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై భావోద్వేగాలు, వినోదాత్మక డ్రామా కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మల్లు నాయక్, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీఆర్‌కే శరణ్ రావుల ఎడిటింగ్, వి వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతున్న హై చిత్రం నవంబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సరికొత్త కథనంతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.