BREAKING
రెండో రోజు ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు! దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘం : మిట్స్‌లో ఘనంగా మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం ఈ నెల 21న స్పెషల్ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి పవన్ కళ్యాణ్,జనసేనను విమర్శిస్తే సహించేది లేదు : జనసేన మహిళ నేత రూ.7 కోట్ల స్కాం ఆరోపణలు అవాస్తవం : ఖండించిన జనసేన నాయకులు గణి రాయల్,జగదీష్ రాయల్ పవన్ కళ్యాణ్,జనసేనను విమర్శిస్తే సహించేది లేదు : జనసేన మహిళ నేత రూ.7 కోట్ల స్కాం ఆరోపణలు అవాస్తవం : ఖండించిన జనసేన నాయకులు గణి రాయల్,జగదీష్ రాయల్ దుర్గిలో నూతన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే జూలకంటి అభినందనలు ఈ నెల 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఈ నెల 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం మదనపల్లి ఎంపీపీగా బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాంతి భద్రతలకు అడ్డంకులు కల్పించే వారిపై కఠిన చర్యలు. కలెక్టర్ పి రాజబాబు. వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ. పుష్పవతి భారతీయ సినిమా భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఇఫీ 2026 అనుమతులు లేకుండా బోర్లు వేస్తే క్రిమినల్ కేసులు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది జైలు, రూ.95 లక్షల జరిమానా ఖరారు.. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్న నటుడు! గ్రంథాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు.

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది జైలు, రూ.95 లక్షల జరిమానా ఖరారు.. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్న నటుడు!

Select Suryaa Now
చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది జైలు, రూ.95 లక్షల జరిమానా ఖరారు.. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్న నటుడు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు విధించిన ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానాను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసిన నేపథ్యంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, చట్టంపై తనకు అపారమైన గౌరవం, పూర్తి విశ్వాసం ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య వద్ద 2018లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున బండ్ల గణేష్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. జానకిరామయ్య మరణానంతరం ఆయన తండ్రి వెంకటేశ్వర్లుకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కోర్టులో కేసు నమోదైంది. 2024లో కింది కోర్టు విధించిన ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా, ఫిర్యాదుదారుడి న్యాయ ఖర్చుల చెల్లింపు తీర్పును తాజాగా సెషన్స్ కోర్టు సమర్థిస్తూ క్రిమినల్ అప్పీల్‌ను కొట్టివేసింది. నాలుగు వారాల్లోపు ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

జిల్లా కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయం కోసం ముందుకు వెళ్లే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని, చట్టాన్ని గౌరవిస్తూ న్యాయవ్యవస్థపై నమ్మకంతో ముందుకెళ్తానని బండ్ల గణేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి సంస్థకు నిర్దిష్ట బాధ్యతలు ఉంటాయని తెలిపారు.

గతంలోనూ బండ్ల గణేష్‌పై పలు చెక్ బౌన్స్ కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. టెంపర్ చిత్ర రచయిత వక్కంతం వంశీ పారితోషికం విషయంలో 2017లో ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించగా, 2019లో కడప కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఘటనలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. తాజా తీర్పుపై తదుపరి న్యాయపరమైన చర్యలు ఎలా ఉంటాయోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.