BREAKING
రెండో రోజు ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు! దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘం : మిట్స్‌లో ఘనంగా మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం ఈ నెల 21న స్పెషల్ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి పవన్ కళ్యాణ్,జనసేనను విమర్శిస్తే సహించేది లేదు : జనసేన మహిళ నేత రూ.7 కోట్ల స్కాం ఆరోపణలు అవాస్తవం : ఖండించిన జనసేన నాయకులు గణి రాయల్,జగదీష్ రాయల్ పవన్ కళ్యాణ్,జనసేనను విమర్శిస్తే సహించేది లేదు : జనసేన మహిళ నేత రూ.7 కోట్ల స్కాం ఆరోపణలు అవాస్తవం : ఖండించిన జనసేన నాయకులు గణి రాయల్,జగదీష్ రాయల్ దుర్గిలో నూతన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే జూలకంటి అభినందనలు ఈ నెల 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఈ నెల 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం మదనపల్లి ఎంపీపీగా బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాంతి భద్రతలకు అడ్డంకులు కల్పించే వారిపై కఠిన చర్యలు. కలెక్టర్ పి రాజబాబు. వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ. పుష్పవతి భారతీయ సినిమా భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఇఫీ 2026 అనుమతులు లేకుండా బోర్లు వేస్తే క్రిమినల్ కేసులు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది జైలు, రూ.95 లక్షల జరిమానా ఖరారు.. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్న నటుడు! గ్రంథాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు.

గ్రంథాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు.

Select Suryaa Now
గ్రంథాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు.

సూర్య న్యూస్ అద్దంకి.

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో బాగంగా అద్దంకి శాఖ గ్రంథాలయం నందు మహిళా దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చిత్రపటానికి అద్దంకి పట్టణ సాహితి ఆధ్యాత్మిక మహిళ బృందం పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచన కర్త రమాసుందరి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ధైర్య సాహసాలకు పెట్టింది పేరు భారతరత్న ఇందిరాగాంధీ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని, మహిళా చైతన్యమే అభివృద్ధికి బాటలు, వెలుగు అని ఆమె అన్నారు. మహిళా హక్కులను కాల రాచే చోట కిరణ్ బేడీలా ప్రతి మహిళ వ్యవహరించాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు..
 చుండూరి కాళీ  ప్రసన్న మాట్లాడుతూ... నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ గ్రంథాలయ పాఠకురాలి నేనని,,చదవడంతో మనం ఊహా లోకంలోకి వెళ్లి మంచి అనుభూతిని పొందుతామని, మెదడు చురుకుగా కూడా పనిచేస్తుందని, పురాణాలు చదవడం వలన సృష్టి, దాని ధర్మం, మన కర్తవ్యం గురించి మనం తెలుసుకోవచ్చునని గ్రంథాలయమే దేవాలయం అని చరిత్ర చెప్పేది నిజమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికి నోట్బుక్ పెన్, జన విజ్ఞాన వేదిక ప్రచురించిన , ఎదిగే ఆడపిల్ల  ఏం తెలుసుకోవాలి అనే పుస్తకం జ్యూట్ బ్యాగుతో  ప్రోగ్రాం ఆర్గనైజర్  మన్నం త్రిమూర్తులు  మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు వసుంధర దేవి, గాదంశెట్టి సునీత, బైసాని  సుజాత, ధూళిపాళ్లవెంకటరత్నం, చిన్ని సుగుణవల్లి, ఏ సుధారాణి, టి తులసీదేవి, జి శాంతకుమారి, మంజుల, కే సామ్రాజ్యం, చిన్ని సురేఖ, వేదవతి, కే రాధా సుమలత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.