BREAKING
గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్! షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ అన్ని రకాల ఎరువులు యాప్ (ఫెర్టిలైజర్ ఫ్రేమ్ వర్క్ స్కీమ్) ద్వారానే. ఎంపీపీగా మల్దిరెడ్డి పుష్పలత.. వైస్ ఎంపీపీగా రసీదాభి ఏకగ్రీవ ఎన్నిక * 16 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. నన్నూరు-3 సభ్యురాలు గైర్హాజరు టైసన్ నాయుడు టీజర్ రిలీజ్.. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్! అమరాపురం ఎంపీపీగా జలజాక్షి జయకుమార్ ఏకగ్రీవ ఎన్నిక బస్వాపూర్ ముదిరాజ్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బోయిని గోపాల్ రెండో రోజు ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు! దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘం : మిట్స్‌లో ఘనంగా మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం ఈ నెల 21న స్పెషల్ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘం : మిట్స్‌లో ఘనంగా మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం

Select Suryaa Now
దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘం : మిట్స్‌లో ఘనంగా మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు మిట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ క్లబ్,ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో గురువారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (ఎస్.ఎ.సి) సహకారంతో  మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా,మదనపల్లె పట్టణానికి చెందిన అరివేణి హ్యాండీక్రాఫ్ట్స్ వ్యవస్థాపకురాలు,చందన మహిళా మండలి ప్రతినిధి లీలావతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తమలోని నైపుణ్యాలను గుర్తించి,వాటిని ఆర్థిక స్వావలంబనకు మార్గాలుగా మలుచుకోవాలన్నారు.తన స్వీయ అనుభవాలను వివరిస్తూ 1992లో హస్తకళల రంగంలో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ప్రస్తుత సమాజంలో మహిళలు అన్నిరంగాల్లోనూ విశేష ప్రతిభను కనబరుస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా,సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు.చిన్న వ్యాపార ఆలోచనలతో ప్రారంభించి,క్రమంగా వాటిని విజయవంతమైన సంస్థలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం,డిజిటల్ మార్కెటింగ్,ఈ-కామర్స్,సోషల్ మీడియా,ఆర్థిక నిర్వహణ,మార్కెట్ విశ్లేషణ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని వివరించారు.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ),డిజిటల్ చెల్లింపులు,ఆన్‌లైన్ వ్యాపార వేదికలు మహిళా పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు.మహిళల ఆర్థిక స్వావలంబన కుటుంబ అభివృద్ధితోపాటు సమాజ,దేశ ఆర్థిక ప్రగతికి కూడా దోహదపడుతుందని తెలిపారు.విద్యార్థులు,ముఖ్యంగా విద్యార్థినులు,తమలోని నైపుణ్యాలను గుర్తించి,ఆత్మవిశ్వాసంతో వినూత్న ఆలోచనలను వ్యాపారాలుగా మలచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి,కో-ఆర్డినేటర్ డాక్టర్ కే.శిరీష,అధ్యాపకులు డాక్టర్ గంగిశెట్టి,శ్రీకాంత్,120 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి