షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి
- పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకుపాటి వెంకటేష్ విస్తృత ప్రచారం
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు పట్టణ అభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలంటే టిడిపి కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ షంసూర్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని టిడిపి యువ నాయకుడు, పట్టణ రెండో ప్రాదేశిక మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆకుపాటి వెంకటేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ ఈ నెల 26న జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో షేక్ షంసూర్‌కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం కోసం కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషితో షేక్ షంసూర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆకుపాటి వెంకటేష్ పిలుపునిచ్చారు.