BREAKING
*చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ : మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్దకే సమగ్ర వైద్యం.. హనుమకొండలో ఘనంగా మెడివాకర్స్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం! ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది? మోసపోయాం జానకి టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా.. చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు! చీపురుపల్లి ఎంపీపీ గా టీడీపీ అభ్యర్థి దన్నాన పద్మావతి ఏకగ్రీవం మీ ఆశీస్సులే నా బలం.. ఆదరించి గెలిపించండి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ

కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని ఆందోళన

Select Suryaa Now
కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని ఆందోళన

--ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ మండల అధ్యక్షులు అమరవరపు అశోక్ నిరసన     వేలేరుపాడు, మేజర్ న్యూస్ : పీసా చట్టం ప్రకారం మండలంలోని కట్కూరు ఎంపీటీసీ ఎన్నిక చెల్లదని టీడీపీ మండల అధ్యక్షులు అమరవరపు అశోక్ అన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట విలేఖర్లతో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన సోడే సురేష్ అనే వ్యక్తి కోయిదా పీసా కమిటీ లో కార్యదర్శి గా ఉంటూ తన పదవికి రాజీనామా చేయకుండా ఎన్నికల నామినేషన్ వేశారని తెలిపారు.ఎన్నికల నిబంధనల ప్రకారం పీసా కమిటీ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసినట్లైతే తమ పదవికి రాజీనామా సమర్పించాలని, రాజీనామా పత్రాన్ని ఐటీడీఏ పీవో నుండి ఆమోదిత పత్రాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ఏ మాత్రం ఎన్నికల నిబంధనలు పాటించకుండా గెలుపొందిన కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని తెలిపారు.వైసీపీ నాయకులతో చేతులు కలిపిన ఇంచార్జీ ఎంపీడీఓ పోటీలో నిలిచిన అభ్యర్ధుల తప్పుడు రాజీనామా పత్రాలను మీడియా ప్రదినిధులకు చూపిస్తున్నారని ఆరోపించారు.ఈ విషయంపై మీడియా ముందర ఐటీడీఏ పీవో రాములు నాయక్ తో ఫోన్ లో మాట్లాడారు.జడ్ పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో వేలేరుపాడు మండలం నుండి ఏ ఒక్క అభ్యర్ధి తనకు పీసా కమిటీ రాజీనామా పత్రాలను సమర్పించ లేదని ఐటీడీఏ పీవో స్పష్టం చేశారు.ఈ విషయం పై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి  కి పిర్యాదు చేసినట్లు తెలిపారు.మధ్యాహ్నం వరకు ఎంపిడిఓ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో ఆందోళన చేపట్టారు.కుక్కునూరు సీఐ బాల సురేష్,యస్ ఐ రాజా రెడ్డి, వేలేరుపాడు ఎస్ఐ నవీన్ కుమార్ లు ఆందోళన పరిస్థితిని ఎప్పటికప్పుడు కట్టడి చేశారు.గెలుపొందిన ఎంపీటీసీ అభ్యర్ధులను ఎంపిడిఓ కార్యాలయం లోనికి పంపించడంతో  నూతన ఎంపీపీగా బాడిస వెంకమ్మ,ఉపాధ్యక్షురాలిగా ఊకె సరోజిని ఎన్నిక జరిగింది.ఈ కార్యక్రమంలో నూప శ్రీరాములు,కోటి పల్లి ముత్యాల రావు,కుక్కు నూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.