మీ ఆశీస్సులే నా బలం.. ఆదరించి గెలిపించండి
- పామూరు మేజర్ పంచాయతీ బరిలో షంషూర్ విస్తృత ప్రచారం
- ఇంటింటి ప్రచారంలో ఓటర్ల నుంచి ఆత్మీయ స్పందన
- మా ఓటు మీకే అంటూ మద్దతు తెలిపిన పట్టణ ప్రజలు
పామూరు, మేజర్ న్యూస్ :
మీ ఆదరణ, ఆశీర్వాదాలే నాకు కొండంత బలం మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటాను. నన్ను మీ ఇంటి బిడ్డగా ఆదరించి సర్పంచ్‌గా గెలిపించండి అంటూ పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి షేక్.షంషూర్ ఓటర్లను అభ్యర్థించారు. గురువారం పట్టణంలోని వివిధ వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ పెద్దలకు చేతులు జోడించి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మహిళలు, యువకులు, పట్టణ ప్రముఖులను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లు షంషూర్‌ను ఆత్మీయంగా పలకరిస్తూ మా ఓటు మీకే మీకే మా మద్దతు అంటూ భరోసా ఇవ్వడం విశేషంగా నిలిచింది. ఓటర్ల నుంచి లభించిన ఈ స్పందన ఆయనలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపిన షంషూర్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో బరిలో నిలిచిన షంషూర్‌కు కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు యాదాల సాయికిరణ్ కుమార్, ఉప్పలపాటి హరిబాబు,ఆకుపాటి వెంకటేష్,పందిటి హరీష్, కావిటి సుబ్బయ్య, నీరుకట్టు రసూల్, బండ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.