చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు
చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు
చీరాల ప్రభుత్వ ఆసుపత్రి రహదారి చెత్తాచెదారంతో నిండిపోయింది. ఇదే మార్గంలో చిన్నారులు పాఠశాలలకు కాలేజీలకు,రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాల భయం నెలకొంది. చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి రహదారిని పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.