BREAKING
సత్య ప్రభ సేవలు చిరస్మరణీయం విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో విశేష కృషి – ఏడవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు శరవేగంగా కొనసాగుతున్న బూరుగుపల్లి బస్టాండ్ పనులు కూతురి పేరు ప్రకటించిన ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్.. సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోలు వైరల్! తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా రాము గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఏఐసీసీ, టిపిసిసి కి ఫిర్యాదు చేస్తా హై సినిమా నుంచి సూపర్ 5 సాంగ్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదల! *చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ : మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్దకే సమగ్ర వైద్యం.. హనుమకొండలో ఘనంగా మెడివాకర్స్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం! ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది?

అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక

Select Suryaa Now
అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక

అట్లూరు, మేజర్ న్యూస్:కడప జిల్లా అట్లూరు మండల పరిషత్ నూతన అధ్యక్షురాలు ఎంపీపీ గా  కుంభగిరి ఎంపీటీసీ సభ్యురాలు పాలకొండు లక్ష్మీదేవి ఎన్నికయ్యారు. గురువారం అట్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఈ ఎన్నికలో పాలకొండు లక్ష్మీదేవిని మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకున్నారు.  అనంతరం మండల పరిషత్ ఉపాధ్యక్ష వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఉపాధ్యక్ష పదవికి ఎవరూ నామినేషన్ ప్రతిపాదించకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు అట్లూరు మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు అట్లూరు ఎంపీడీవో ఆర్. సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులందరూ నిర్ణీత సమయానికి మండల పరిషత్ కార్యాలయానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. దీంతో రేపు జరగనున్న వైస్ ఎంపీపీ ఎన్నికపై మండల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
సూర్య రిపోర్టర్: ఎ.తిరుపాల్ అట్లూరు