BREAKING
ప్రపంచ వాతావరణ నాయకత్వంపై చైనా వెనకడుగు రేవంత్ రెడ్డి తీరుతో కలుషితమవుతున్న తెలంగాణ రాజకీయాలు ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి బ్రిటన్, ఈయూ మధ్య కీలక ఒప్పందాలు రూ.1.15 కోట్ల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం .. విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ హోదా.. మా విజన్ సాకారమవుతోంది: వైఎస్ జగన్ పాలమాకుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇనుప ఖనిజం, బొగ్గు, విద్యుత్ జోరు మహిళా డిగ్రీ కళాశాలలో ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అలింకో ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి - మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట అభివృద్ధికి.. తెలంగాణ ఉద్యమానికి మదన్ మోహన్ సేవలు చిరస్మరణీయం! శతవసంతాల శిఖరం చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నికల విధుల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బాడంగి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఎంవీఎస్ కళాశాలకు పరిశోధనా కేంద్రం మంజూరు బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి

చీపురుపల్లి ఎంపీపీ గా టీడీపీ అభ్యర్థి దన్నాన పద్మావతి ఏకగ్రీవం

Select Suryaa Now
చీపురుపల్లి ఎంపీపీ గా టీడీపీ అభ్యర్థి దన్నాన పద్మావతి ఏకగ్రీవం

 చీపురుపల్లి మేజర్ న్యూస్: చీపురుపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా టీడీపీ అభ్యర్థి, కరకాం ఎంపీటీసీ గా గెలిచిన దన్నాన పద్మావతి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎస్ తవిటి నాయుడు  ఎంపీపీ ఎన్నిక ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి 12 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, ఇద్దరు జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. పట్టణంలోని 4వ వార్డు ఎంపీటీసీ గవిడి నాగరాజు ఎంపీపీ గా దన్నాన పద్మావతి పేరు ప్రతిపాదించగా మరో ఎంపీటీసీ చందక దుర్గాభవాని బలపరిచడంతో మిగిలిన సభ్యులు వారి అంగీకారాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఎంపీపీ గా దన్నాన పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారులు చేతులమీదుగా ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ప్రాంగణంలో  ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, ఎంపీడీవో ఐ సురేష్, టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కాము నాయుడు, దన్నాన రామచంద్రుడు, ఎంపీటీసీ సభ్యులు వెంపడాపు హైమావతి, రేగాన శాంతి ప్రియ,  శనపతి నవ్య, ఇజ్జిరోతు నిహారిక, రెడ్డి శాంతమ్మ, వెంపడాపు రాజేశ్వరి, సప్ప లక్ష్మి, కోట్ల కృష్ణ, పొన్నాడ మహేశ్వరరావు, బైరెడ్డి మణికంఠ  పాల్గొన్నారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా