చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా తుపాకుల చిన్న శేషయ్య ఏకగ్రీవ ఎన్నిక ఉపాధ్యక్షురాలిగా చింతల సోనియా ఎంపిక
చిట్టమూరు మేజర్ న్యూస్
చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలిగా చింతల సోనియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ భవనంలో రిటర్నింగ్ అధికారి రాజా సోము అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన 12 మంది ఎంపీటీసీలతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి తుపాకుల చిన్న శేషయ్యను మండల పరిషత్ అధ్యక్షులుగా, చింతల సోనియాను ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఉపాధ్యక్షురాలు, ఎంపీటీసీలను అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు పెళ్లూరు సౌజన్య రెడ్డి, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, తహసీల్దార్ రామయ్య,ఎస్ఐ నాగరాజు,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*చిట్టమూరు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల వివరాలు*
1. కనుబోయిన శేషమ్మ – బురదగాలి
2. కమతం చెంగయ్య – కోగిలి
3. పిగిలాం కస్తూరయ్య – మెట్టు
4. కుదురు అమీరమ్మ – మల్లాం-1
5. చల్లా కిరణ్మయి – గుణపాడు
6. చింతల సోనియా – చిట్టమూరు
7. తుపాకుల చిన్న శేషయ్య – చిల్లమూరు
8. నల్లారెడ్డి మదాలస – అరవపాలెం
9. సిద్దపరెడ్డి పోలమ్మ – యాకశిరి
10. భట్టా రామయ్య – ఈశ్వరవాక
11. కుదురు వెంకటేష్ – మల్లాం-2
12. కామిరెడ్డి రమేష్ రెడ్డి – ఆరూరు
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్