BREAKING
*చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ : మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్దకే సమగ్ర వైద్యం.. హనుమకొండలో ఘనంగా మెడివాకర్స్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం! ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది? మోసపోయాం జానకి టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా.. చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు! చీపురుపల్లి ఎంపీపీ గా టీడీపీ అభ్యర్థి దన్నాన పద్మావతి ఏకగ్రీవం మీ ఆశీస్సులే నా బలం.. ఆదరించి గెలిపించండి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ

జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు

Select Suryaa Now
జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు

బంట్వారం, మేజర్ న్యూస్: మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన జానపద గాయని తులసికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నవంబర్ 15న దేశ రాజధానిలో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కాన్ఫరెన్స్–2026 అవార్డుల ప్రదానోత్సవంలో ఆమెకు బెస్ట్ సింగర్‌గా జాతీయ అవార్డు అందజేశారు. వికారాబాద్ జిల్లా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తులసి గురువారం స్వగ్రామానికి చేరుకోగా గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. పల్లె పాటలు, జానపద గీతాలను ఆలపిస్తూ యూట్యూబ్ వేదికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె తెలంగాణ పల్లె సంస్కృతి, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన గాన ప్రతిభతో జాతీయ స్థాయి అవార్డును అందుకోవడం యాచారం గ్రామంతో పాటు బంట్వారం మండలం, వికారాబాద్ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. జానపద కళారంగంలో మరింత రాణించి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.