గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్
గుంటూరు: నగరంలో గార్బేజ్ పాయింట్లు లేకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని నగర పాలక సంస్థ యం.ఒ.హెచ్ డాక్టర్ సురేష్ తెలిపారు. గురువారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ కాన్ఫరెన్సు హాల్ నందు శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా యంహెచ్ఓ మాట్లాడుతూ, నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉండడానికి వీలులేదని, గార్బేజ్ ఎక్కడైనా వెంటనే తొలగించి, గార్బేజ్ పాయింట్ల వద్ద ఎవరు వ్యర్ధాలు వేస్తుందని నిఘా పెట్టి గుర్తించి వారికి అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. అంతేకాక్ స్ట్రీట్ వెండార్లు కూడా వారి వ్యాపార వ్యర్ధాలను రోడ్ల పై వేయకుండా పర్యవేక్షణ చేయాలని, ఎవరైనా వ్యర్ధాలను వేసినట్లు గుర్తించినట్లైతే, వారి వ్యాపార సముదాయాలు తొలగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలో మెరుగైన పారిశుధ్య పనుల నిర్వహణకు డోర్ టు డోర్ చెత్త సేకరణకు పూర్తి స్థాయిలో వాహనాలు మరియు కార్మికులను కేటాయించామని, పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. పారిశుధ్య కార్మికుల హాజరు తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే తీసుకోవాలని, దాని ప్రకారమే జీతాలు చెల్లించటం జరుగుతుందన్నారు. ఉదయం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ అధిక ప్రాధాన్యత ఇస్తూ డ్రైన్లను ప్రతి రోజు శుభ్రం చేయాలన్నారు. డ్రైన్లలో తొలగించిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించాల న్నారు. అన్న క్యాంటీన్ల వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. నగరంలో వ్యాపారాలు నిర్వహించే ప్రతి షాప్ యజమానికి తప్పనిసరిగా డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ గడువు ముగిసిన షాపులకు లైసెన్స్ రెన్యువల్ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలోని ఖాళీ స్థలాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు వృద్ది చెందకుండా యాంటి లార్వ మందులను స్ప్రే చేయించాలని బయాలజిస్ట్ ని ఆదేశించారు. రోడ్ల మార్జిన్ల పై ప్రజలు భవన నిర్మాణ వ్యర్ధాలను వేయకుండా పర్యవేక్షించాలని, ఎవరైనా వేసినట్లయితే వెంటనే తొలగించాలన్నారు. సమావేశంలో బయాలజిస్ట్ శేషయ్య, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
సూర్య నాయక్