BREAKING
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ ఉత్కంఠకు తెర.. తాడిమర్రి ఎంపీపీగా కూచి నాగవేణి ఎన్నిక! తెరవెనుక రాజకీయ సమీకరణాలకు చెక్.. ఐదుగురు టీడీపీ ఎంపీటీసీల ఐక్యతతో దక్కిన ఎంపీపీ పీఠం అద్దంకి ఎంపీపీ గా సందెపామ్ జేమ్స్. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేగ జాబ్ మేళా చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా తుపాకుల చిన్న శేషయ్య ఏకగ్రీవ ఎన్నిక ఉపాధ్యక్షురాలిగా చింతల సోనియా ఎంపిక కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని ఆందోళన మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న!

ఎంపీపీగా మల్దిరెడ్డి పుష్పలత.. వైస్ ఎంపీపీగా రసీదాభి ఏకగ్రీవ ఎన్నిక * 16 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. నన్నూరు-3 సభ్యురాలు గైర్హాజరు

Select Suryaa Now
ఎంపీపీగా మల్దిరెడ్డి పుష్పలత.. వైస్ ఎంపీపీగా రసీదాభి ఏకగ్రీవ ఎన్నిక  * 16 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. నన్నూరు-3 సభ్యురాలు గైర్హాజరు

మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి!

* ఎంపీపీగా మల్దిరెడ్డి పుష్పలత.. వైస్ ఎంపీపీగా రసీదాభి ఏకగ్రీవ ఎన్నిక

* 16 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. నన్నూరు-3 సభ్యురాలు గైర్హాజరు

* ఘనంగా నూతన మండల పరిషత్ పాలకవర్గ బాధ్యతల స్వీకరణ

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేస్తూ  మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం ఓర్వకల్లు మండలప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన మండల పరిషత్ పాలకవర్గ ఎన్నిక,ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమం రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎం. నాగ అనసూయ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికైన సభ్యుల్లో 16 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో దుగ్గపాటి లక్ష్మి, మల్లెల జ్యోతి, రసిదాబి, షేక్ అలీ భాష, మద్దిలేటి నాయక్, డబ్బుల పెద్ద గిడ్డయ్య, లక్ష్మీదేవి, కానుగల బుగ్గన, లక్ష్మీదేవి, తెలుగు లక్ష్మి, కళ్లం పద్మావతి, బండారు హనుమన్న, రమణమ్మ, భారతి, పుష్పలత, బైరెడ్డి మౌనిక ఉన్నారు. నన్నూరు-3 ఎంపీటీసీ సభ్యురాలు శ్రీరెడ్డి శైలజ గైర్హాజరయ్యారు. అనంతరం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన  పుష్పలతనుఎంపీపీగా, హుస్సేనాపురం గ్రామానికి చెందిన రసీదాభిని వైస్ ఎంపీపీగా   ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీపీ, తన చాంబర్ కు వెళ్లి పదవి బాధ్యతలు చేపట్టారు.వైస్ ఎంపీపీలు  ఎంపీటీసీ లు తమకు కేటాయించిన స్థానాల్లో ఆసీనులై బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు ఎంపీపీ మల్దిరెడ్డి పుష్పలత వైస్ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేశారు. నూతన పాలకవర్గ సభ్యులను ఎంపీటీసీలను ఎమ్మెల్యే నాయకులు పలువురు అభినందించి  ఘనంగా సత్కరించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి 94 శాతం విజయం సాధించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. ఓర్వకల్లు మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, జిల్లా ట్రెజరర్ మహబూబ్ బాషా, మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు  తదితరులు పాల్గొన్నారు.