BREAKING
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ ఉత్కంఠకు తెర.. తాడిమర్రి ఎంపీపీగా కూచి నాగవేణి ఎన్నిక! తెరవెనుక రాజకీయ సమీకరణాలకు చెక్.. ఐదుగురు టీడీపీ ఎంపీటీసీల ఐక్యతతో దక్కిన ఎంపీపీ పీఠం అద్దంకి ఎంపీపీ గా సందెపామ్ జేమ్స్. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేగ జాబ్ మేళా చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా తుపాకుల చిన్న శేషయ్య ఏకగ్రీవ ఎన్నిక ఉపాధ్యక్షురాలిగా చింతల సోనియా ఎంపిక కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని ఆందోళన మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న!

టైసన్ నాయుడు టీజర్ రిలీజ్.. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Select Suryaa Now
టైసన్ నాయుడు టీజర్ రిలీజ్.. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టైసన్ నాయుడు టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ చిత్రాల దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటివరకు చూడని కొత్త మాస్ లుక్, యాక్షన్ అవతార్‌తో ఆయన సందడి చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఏర్పడింది.

తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాలోని ప్రధాన సంఘర్షణను ఆవిష్కరించింది. నేరస్థులు, సమాజానికి ఇబ్బంది కలిగించే వారిని ఎదుర్కోవడానికి పోలీసు శాఖలో ఎస్ఓటీ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. అధికారిక రికార్డులు, అరెస్టులతో సంబంధం లేకుండా అక్కడికక్కడే శిక్షించే విధానంతో సాగే ఈ టీమ్ కార్యకలాపాలు, మరోవైపు నగరంలో జరుగుతున్న వరుస నేరాల వెనుక ఉన్న భారీ కుట్రను కథానాయకుడు ఛేదించే తీరు టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు.

ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ప్రజ్ఞా జైస్వాల్ పాత్రలో ఏదో మిస్టరీ దాగి ఉందనే విధంగా ఆమె షాట్స్‌ను రూపొందించారు. నరేష్, సునీల్, రావు రమేష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మదరాసి రబ్బరు బొమ్మ పాట జానపద బీట్స్, దృశ్యాలతో శ్రోతలను ఆకట్టుకోగా, తాజా టీజర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హరీష్ కట్ట ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అనీత్, ముకేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, విజయ్ పోలాకి, భాను యాక్షన్ కొరియోగ్రఫీతో రూపొందుతున్న టైసన్ నాయుడు యాక్షన్ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది.