నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ
నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నేడు జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, వైస్-ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ నగరం లోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు చిత్తూరులో జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, వైస్-ఛైర్ పర్సన్ ల ఎన్నిక కోరం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య 27 ఉండగా, నిబంధన ప్రకారం కోరం 14మంది సభ్యులు ఉండాలన్నారు. సభ్యులు చేతులు పైకెత్తి ఓటు వేయడం ద్వారా ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నిక పూర్తయిన వెంటనే నామినేట్ చేయబడిన వ్యక్తుల పేర్లను ప్రకటించాలన్నారు. ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, వైస్-ఛైర్ పర్సన్ లతో ప్రమాణ స్వీకారం చేయించి, ధ్రువీకరణ పత్రం జారీ చేయాలన్నారు. తదుపరి నూతనంగా ఎన్నికైన సంస్థ పదవీకాలం ప్రారంభమైనట్లు ప్రకటిస్తారన్నారు. తద్వారా పరిపాలనా సంస్థకు జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ అధ్యక్షత వహిస్తూ మొదటి సమావేశం నిర్వహిస్తారన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.