BREAKING
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ ఉత్కంఠకు తెర.. తాడిమర్రి ఎంపీపీగా కూచి నాగవేణి ఎన్నిక! తెరవెనుక రాజకీయ సమీకరణాలకు చెక్.. ఐదుగురు టీడీపీ ఎంపీటీసీల ఐక్యతతో దక్కిన ఎంపీపీ పీఠం అద్దంకి ఎంపీపీ గా సందెపామ్ జేమ్స్. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేగ జాబ్ మేళా చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా తుపాకుల చిన్న శేషయ్య ఏకగ్రీవ ఎన్నిక ఉపాధ్యక్షురాలిగా చింతల సోనియా ఎంపిక కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని ఆందోళన మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న!

అమరాపురం ఎంపీపీగా జలజాక్షి జయకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
అమరాపురం ఎంపీపీగా జలజాక్షి జయకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

• వైస్ ఎంపీపీగా బి. నాగరాజు

• 16 మంది ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు


అమరాపురం మేజర్ న్యూస్ నవంబరు 19: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఘనంగా ముగిసింది. 16 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం మండల పరిధిలోని మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 10 స్థానాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సయ్యద్ హఫీజ్ ఉల్లా మరియు ఎంపీడీవో రామారావు ఆధ్వర్యంలో నూతన సభ్యులందరితో ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత హాలుకూరు ఎంపీటీసీ సభ్యురాలితో ప్రారంభమైన ఈ ప్రక్రియ, చివరిగా అగ్రహారం ఎంపీటీసీ సభ్యుడి ప్రమాణ స్వీకారంతో ముగిసింది. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే వైసీపీ ఎంపీటీసీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఏకగ్రీవంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక అనంతరం ఎంపీడీవో రామారావు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. 10 మంది టీడీపీ ఎంపీటీసీల మద్దతుతో హేమావతి-1 ఎంపీటీసీ సభ్యురాలు జలజాక్షి జయకుమార్ ఎంపీపీ పదవికి నామినేషన్ వేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని అమరాపురం-1 ఎంపీటీసీ కే. రాఘవేంద్ర ప్రతిపాదించగా, బసవన్నపల్లి ఎంపీటీసీ నాగమణి బలపరిచారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో జలజాక్షి జయకుమార్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీడీవో ప్రకటించారు. తదుపరి నిర్వహించిన ఉపాధ్యక్ష ఎన్నికలో అమరాపురం-2 ఎంపీటీసీ సభ్యుడు బి. నాగరాజు పేరును ఆలదపల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రతిపాదించి బలపరచడంతో, ఆయన వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. శుభాకాంక్షల వెల్లువ నూతనంగా ఎన్నికైన ఎంపీపీ జలజాక్షి జయకుమార్, వైస్ ఎంపీపీ బి. నాగరాజు, ఇతర ఎంపీటీసీ సభ్యులను నూతన జడ్పీటీసీ ఎల్. శివ రుద్రప్ప, టీడీపీ మండల కన్వీనర్ కృష్ణమూర్తి తదితరులు పూలమాలలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.