BREAKING
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ ఉత్కంఠకు తెర.. తాడిమర్రి ఎంపీపీగా కూచి నాగవేణి ఎన్నిక! తెరవెనుక రాజకీయ సమీకరణాలకు చెక్.. ఐదుగురు టీడీపీ ఎంపీటీసీల ఐక్యతతో దక్కిన ఎంపీపీ పీఠం అద్దంకి ఎంపీపీ గా సందెపామ్ జేమ్స్. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేగ జాబ్ మేళా చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా తుపాకుల చిన్న శేషయ్య ఏకగ్రీవ ఎన్నిక ఉపాధ్యక్షురాలిగా చింతల సోనియా ఎంపిక కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని ఆందోళన మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న!

పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్.

Select Suryaa Now
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్.

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
నగరంలోని ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డా. అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటి పరిశుభ్రతను కాపాడేందుకు స్థానిక ప్రజలు సహకరించాలని సూచించారు.
గురువారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజా మరుగుదొడ్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, స్వర్ణ వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రీలతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మరుగుదొడ్లను వినియోగించిన అనంతరం శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలకు వివరించారు.అనంతరం న్యూ బాలాజీ కాలనీలో ఇంటింటి నుంచి చెత్త సేకరణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి పారిశుధ్య కార్మికులకు అందించాలని సూచించారు. చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ఈ సందర్భంగా ఇంటింటి చెత్త సేకరణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, స్వర్ణ వార్డు కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్