దుర్గిలో నూతన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే జూలకంటి అభినందనలు
దుర్గి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల ఎంపీటీసీ, ఎంపీపీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం నూతన ఎంపీపీ యాగంటి నాగలక్ష్మీ నరేష్, వైస్ ఎంపీపీ గాలి పద్మావతి శ్రీనివాసరావులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.