పవన్ కళ్యాణ్,జనసేనను విమర్శిస్తే సహించేది లేదు : జనసేన మహిళ నేత రూ.7 కోట్ల స్కాం ఆరోపణలు అవాస్తవం : ఖండించిన జనసేన నాయకులు గణి రాయల్,జగదీష్ రాయల్
మదనపల్లి,మేజర్ న్యూస్ : ప్రజా శ్రేయస్సు,రాష్ట్ర అభివృద్ధికై నిరంతరం పరితపించే నాయకుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని,జనసేన మహిళా నేత రుక్మిణి రూ.7 కోట్ల స్కాంకి పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవవాస్తవమని ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ గణి,మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ రాయల్ తీవ్రంగా ఖండించారు.గురువారం పట్టణంలోని శీనా టీస్టాల్ ఎదురుగా ఉన్న మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అవినీతి రహిత పాలన,విలువలతో కూడిన రాజకీయాలే పవన్ కళ్యాణ్ ప్రధాన ధ్యేయమన్నారు.అటువంటి వ్యక్తి,పార్టీపై దుష్ప్రచారం చేస్తే సహించలేదన్నారు.పార్టీలో కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తూ జనసేన అధినేత,పార్టీ ప్రతిష్టను దిగజార్చే చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు అక్రమాస్తులు సంపాదించారని,ఇది ఆ పార్టీ నేతలకు తెలియదా అని ఎద్దేవ చేశారు.తెలుగు సినీ రంగంలో అగ్ర కథానాయకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించి,ఒక్కో సినిమాకు రూ.200 కోట్లు ఆదాయం వస్తున్నప్పటికీ,ప్రజలకు సేవ చేయాలని గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు.అటువంటి నాయకుడిని విమర్శిస్తే సహించేది లేదన్నారు.ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,జనసేన పార్టీపై విమర్శలు చేసేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు.ఇప్పటికైనా ఇటువంటి అసత్య ఆరోపణలు మాని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.మరోసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఘాటుగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు నాగార్జున,రమేష్,వాసుదేవ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి