andhrapradesh
శాంతి భద్రతలకు అడ్డంకులు కల్పించే వారిపై కఠిన చర్యలు. కలెక్టర్ పి రాజబాబు.
సూర్య న్యూస్ అద్దంకి.
జిల్లా కలెక్టర్ పి. రాజబాబు స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు చక్రధర్ బాబు మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారితో కలసి అద్దంకి రెవిన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దర్శి నియోజకవర్గ అదనపు నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశీలన అనంతరం పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టడం జరిగిందని తొలి విడుద సజావుగా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది అన్నారు. రెండో విడత నామినేషన్ ప్రక్రియ అద్దంకి ,దర్శి నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండు నియోజకవర్గాలు కలిపి పది మండలాలలో 198 గ్రామపంచాయతీలు ఉన్నాయని వాటికి సంబంధించి 61 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతితో అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అదనపు నామినేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీలలో పార్టీలు ఉండవని , పార్టీలు బలపరిచిన వ్యక్తులు , ఇండిపెండెంట్ లు ఉంటారని ఆయన తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని దానిని అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు వెయ్యాలని అవసరం అయితే పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న అధికారులకు గానీ నామినేషన్ వేసే అభ్యర్థులకు గాని ఎటువంటి అసౌకర్యం కలిగించిన ఉపేక్షించేది లేదని దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నామినేషన్ వేసే దానిలో అభ్యర్థులు ఏదన్న ఇబ్బందులకు గురయ్య పరిస్థితి ఉంటే పోలీసులకు తెలిపి వారి సహకారంతో ప్రశాంత వాతావరణం లో నామినేషన్ వేయాలన్నారు. శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిపై పలు రకాల కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. జిల్లాలో తొలి విడత నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. దర్శి నియోజకవర్గంలో చోటుచేసుకున్న కొన్ని స్వల్ప ఘటనల నేపథ్యంలో, అదనపు నామినేషన్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి తీసుకుని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సుహృద్భావ వాతావరణంలో సాగేలా పోలీస్ శాఖ తరఫున అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, ఛార్జిషీట్లు దాఖలు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి అనుపమ, దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.