మదనపల్లి ఎంపీపీగా బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : మదనపల్లి మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపిపి)గా బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ప్రొసీడింగ్ అధికారిణి లక్ష్మీప్రసన్న,ఎంపిడిఓ తాజ్ మాస్రూర్ ఆధ్వర్యంలో పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ),ఉపాధ్యక్షుల ఎన్నిక కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు.ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలకు చెందిన 18 మంది ఎంపీటీసీల సంపూర్ణ మద్దతుతో మదనపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అదేవిధంగా ఈశ్వరమ్మ కాలనీ ఎంపీటీసీ సభ్యులు మాకినేని చంద్రశేఖర్ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లి మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా,కూటమి ఎంపీటీసీల సంపూర్ణ మద్దతుతో ఎంపీపీ,వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం సంతోషకరమని తెలిపారు.కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మదనపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు,ప్రజా సమస్యల పరిష్కారానికి,అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.నూతన ఎంపిపి గురునాథ్ యాదవ్,వైఎస్ ఎంపిపి చంద్రశేఖర్ ఇతర ఎంపీటీసీలకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని,మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.
రిపోర్టర్ :కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి